Sunday, May 5, 2024

అందుకే ఓటిటిలో ‘నారప్ప’…

- Advertisement -
- Advertisement -

D Suresh babu Interview about 'Narappa'

వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నారప్ప’. డి.సురేష్‌బాబు, కలైపులి యస్. థాను నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేశ్‌బాబు మీడియాతో పంచుకున్న విశేషాలు…
అందుకే ఓటిటిలో…
‘నారప్ప’ సినిమాను నేను, కలైపులి యస్. థాను కలిసి నిర్మించాము. ఈ ఏడాది ఏప్రిల్‌లో ధనుష్ ‘కర్ణన్’ సినిమాను థాను విడుదల చేశారు. విడుదలైన మొదటివారంలో 100 శాతం ఆక్యూపెన్సీతో ఉన్న థియేటర్స్ ఆ తరువాత 50 శాతానికి పడిపోయాయి. ఆ నెక్ట్స్ వెంటనే సినిమాను తీసేశారు. దానివల్ల థాను దాదాపు 15 కోట్లు నష్టపోయారు. ఇక, ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకున్నప్పుడు కోవిడ్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయో తెలియదు. ఒకవేళ ఓపెన్ అయినా ప్రేక్షకుల ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు. ఇన్ని కారణాల వల్ల నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సివస్తోంది.
లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఉండక తప్పదు….
ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలకానందుకు వెంకటేశే కాదు నేను ఫీల్ అవుతున్నాను. అభిమానులు బాధపడుతున్నారు. కానీ మనం లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఉండక తప్పదు. ‘నారప్ప’ సినిమా నాదే అయితే ఖచ్చితంగా ఓటీటీలో విడుదల చేసేవాడిని కాదు. నాకు పార్ట్‌నర్స్ ఉన్నారు. వారి ఆర్థిక సౌకర్యాలు, లబ్ధిని నేను ఆపలేను. అయితే ఎగ్జిబిటర్స్ సమస్యలను నేను అర్థం చేసుకోగలను. నాకు బాధగానే ఉంది, కానీ నా భాగస్వామ్యులను ఇబ్బంది పెట్టలేను కదా. ప్రపంచలోనే అతి పెద్ద ప్రొడక్షన్ సంస్థ డిస్నీ కూడా తన సినిమాలను ఏకకాలంలో ఓటీటీ, థియేటర్స్‌లో విడుదల చేస్తోంది.
వెంకటేశ్ బాగా చేశాడు…
‘నారప్ప’ లాంటి కథలను ఎవరూ వెంకటేశ్ కోసం రాయరు. ఈ సినిమాలో వెట్రిమారన్ స్టైల్ నాకు నచ్చింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ ఫ్యామిలీ ఎమోషన్స్, సామాజిక అంశాలు ఉన్నాయి. ఈ సినిమా వర్కవుట్ అవుతుందని అనిపించింది. ఇక ఈ సినిమాలో వెంకటేశ్ చాలా బాగా చేశాడు.
బాగా తెరకెక్కించారు…
ఈ సినిమా రైట్స్ తీసుకున్న తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఓ సారి వచ్చి ఓ కథ చెప్పారు. ఆ తర్వాత మేము నారప్ప సినిమా గురించి మాట్లాడుకున్నాం. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తానన్నారు. ఆయన ‘నారప్ప’ను చాలా బాగా తెరకెక్కించారు.
భయాందోళనకు గురయ్యాము…
ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కొంత భయాందోళనకు గురయ్యాము. ఫస్ట్ షెడ్యూల్ 52 రోజుల పాటు చేసిన తర్వాత పక్క ఊరిలో కోవిడ్ వచ్చిందని సినిమా షూట్‌ను ఆపేశాం. ఆ తర్వాత చాలా భయం, భయంగానే ఈ సినిమాను చేశాం.

D Suresh babu Interview about ‘Narappa’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News