Monday, May 6, 2024

హైదరాబాద్ లో కుండపోత వర్షం..

- Advertisement -
- Advertisement -

Heay Rain in Hyderabad

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షం కురుసింది. రాత్రి 8 గంటల సమయం నుంచి దాదాపు గంటర్నకుపైగా ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, కోఠి, చిక్కడపల్లి, ముషీరాబాద్, ట్యాంక్‌బండ్, నారాయణగూడ, కాచిగూడ, దిల్‌సుఖ్ నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్‌లో ఏకధాటిగా వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, డ్రైనేజీలు, నాళాలు పొంగిపోర్లాయి. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మళ్లీ వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో బయటకు రావొద్దని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Heay Rain in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News