Monday, May 6, 2024

అంతులేని కళ్ళలోకిలా… అందమొచ్చి దూకితే ఎలా

- Advertisement -
- Advertisement -

Hero nithin act with naba natesha

 

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం లో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, – ఫస్ట్ లుక్ పోస్టర్, – టీజర్‌లకు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ‘బేబీ ఓ బేబీ’ పూర్తి పాట లిరికల్ వీడియోని ‘మాస్ట్రో’ టీమ్ రిలీజ్ చేసింది. ‘అంతులేని కళ్ళలోకిలా.. అందమొచ్చి దూకితే ఎలా.. మనసుకి లేని తొంద రా.. మొదలిక మెల్ల మెల్లగా..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి వాయిస్ మరింత స్పెషల్‌గా మార్చింది. దీనికి గీత రచయిత శ్రీజో సాహిత్యం అందించారు. ఈ పాటలో నితిన్. – నభా నటేష్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. గోవాలోని అం దమైన లొకేషన్స్‌లో ఈ సాంగ్ షూట్ చేశారు. దీనికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి,- నికిత రెడ్డి నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News