Sunday, May 5, 2024

టీసేవ్ దీక్షకు హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:నిరుద్యోగ సమస్యలపై ఇందిరాపార్క్ వద్ద వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన టిసేవ్ నిరాహారదీక్షకు హైకోర్టు అనుమతి లభించినట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. దీక్ష చేసే 48 గంటలు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. దీక్ష నిర్వహణలో భాగంగా జనసమీకరణ 500 మంది కంటే ఎక్కవ ఉండరాని హైకోర్టు సూచించిందని తెలిపారు.

దీక్షకు హైకోర్టు అనుమతి ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూసినా న్యాయం బ్రతికే ఉందనటానికి గౌరవ హైకోర్టు తీర్పు ఒక నిదర్శనం అన్నారు. బిస్వాల్ కమిటి సిఫార్సుల ప్రకారం ఖాళీగా ఉన్న 1.91లక్షల ఉద్యోగాలు భర్తీచేసే వరకూ నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదని షర్మిల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News