Monday, April 29, 2024

హోలా రే హోలా…

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీవిష్ణు ’సామజవరగమన’తో హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి హోలా రే హోలా… అనే పాటని విడుదల చేశారు మేకర్స్.

గోపీ సుందర్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఆకట్టుకునే మెలోడీలా కంపోజ్ చేశారు. జెవి సుధాన్షు, సోనీ కొమందూరి పాడిన ఈ పాటకు శ్రీమణి అందించిన లిరిక్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వున్నాయి. ఈ పాటలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. పాటలో విజువల్స్ గ్రాండ్‌గా వున్నాయి. ఈనెల 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News