Sunday, April 28, 2024

‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

Hollywood action director for Yashoda

 

కమర్షియల్ వాల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆమె శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో చేస్తున్న చిత్రం ‘యశోద’. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ కంటే డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ’ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్‌లో జరిగే షెడ్యూల్‌లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News