Sunday, April 28, 2024

భారీ యాక్షన్ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే గోవా షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న మహేష్ చిన్న బ్రేక్‌లో ఇప్పుడు ఉన్నాడు. అయితే ఈ చిత్రం అనంతరం మహేష్ తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నాడని తెలియడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని.. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ మూవీ ఉంటుందని తెలిసింది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ హాలీవుడ్ టెక్నిషియన్స్‌ని రంగంలోకి దింపనున్నాడట. అలాగే ఇది ఒక సాలిడ్ రివెంజ్ డ్రామాలా ఉండొచ్చని టాక్. మరి ఇవన్నీ ఎంత వరకు నిజమో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Hollywood technicians for Mahesh and Trivikram’ film?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News