Sunday, May 19, 2024

జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సి ఇప్పట్లో లేదు:హోం శాఖ

- Advertisement -
- Advertisement -

 

 

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సి)ని తయారు చేయాలన్న నిర్ణయమేదీ కేంద్రం తీసుకోలేదని మొట్టమొదటిసారి మంగళవారం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్‌సభలో ధృవీకరించింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సిని తయారుచేయాలని ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం శాఖ లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. కాగా, ఎన్‌ఆర్‌సిని దేశవ్యాప్తంగా అమలు చేసే విషయం ఇప్పటివరకు చర్చించలేదని ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధినాయకత్వం పలుమార్లు ప్రకటించినప్పటికీ విపక్షాలు మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వివరణ గతంలో వచ్చినప్పటికీ పశ్చిమ బెంగాల్ బిజెపి శాఖ సిఎఎ తీసుకువచ్చిన తర్వాత ఎన్‌ఆర్‌సిని అమలు చేయనున్నట్లు ఒక బుక్‌లెట్ కూడా ప్రచురించడం గమనార్హం.

 

Home ministry Amith Shah clarifies on NRC

 

Home ministry clarifies on NRC, Centre has no plans of Pan -India NRC, Home ministry clarifies in LS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News