Monday, April 29, 2024

జూన్ నాటికి భారత్‌లో కొవొవాక్స్ టీకా : పూనావాలా

- Advertisement -
- Advertisement -

Hopes to launch Covavax by June 2021: Poonawalla

 

పుణె : ఈ ఏడాది జూన్ నాటికి కొవొవాక్స్ అనే మరో టీకాను భారత్‌లో ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్ పూనావాలా వెల్లడించారు. నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొవొవాక్స్ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తోందని, భారత్‌లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఇప్పటికే అనుమతులు కోరామని, జూన్ కల్లా అందుబాటు లోకి తీసుకొస్తామని ఆశిస్తున్నట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు కోరినట్టు సీరం సంస్థ శుక్రవారం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ కొవొవాక్స్ టీకా సామర్థం 95.6 శాతంగా తేలినట్టు సీరం సంస్థ ఇదివరకు ప్రకటించింది. నోవావాక్స్ సంస్థతో గతం లోనే ఒప్పందం కుదుర్చుకున్న సీరం సంస్థ ఏప్రిల్ నుంచి నెలకు 4050 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. ఈ టీకా బ్రిటన్ రకం వైరస్‌ను కూడా సమర్థంగా నివారిస్తుందని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని వారు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News