Monday, April 29, 2024

రూ.1,446 కోట్ల ‘లగ్జరీ బంగ్లా’ను కొన్న అదర్ పూనావాలా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యాక్సీన్‌ను కనిపెట్టిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సిఇఒ అదర్ పూనావాలా లండన్‌లో విలాసవంతమైన ఇంటి కొనుగోలు చేశారు. సెంట్రల్ లండన్‌లో ఇల్లు కొనుగోలు చేసినందుకు 138 మిలియన్ పౌండ్లను (రూ.1,446 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ ఇంటి విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు ఉంటుంది. పోలండ్‌కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డొమినికా కుల్జిక్ నుంచి పూనావాలా దీన్ని కొనుగోలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం, లండన్‌లోని ఆస్తిని పూనావాలా కుటుంబానికి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన బ్రిటన్ అనుబంధ సంస్థ సీరమ్ లైఫ్ సైన్సెస్ కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందంతో అబెర్‌కాన్‌వే హౌస్ లండన్‌లో ఇప్పటివరకు విక్రయించిన రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News