Monday, April 29, 2024

జెఎన్‌యూలో గుంపులు కట్టొద్దు

- Advertisement -
- Advertisement -

కట్టుదిట్టమైన నిషేధాజ్ఞల జారీ

న్యూఢిల్లీ : స్థానిక జెఎన్‌యూలో మంగళవారం కట్టుదిట్టమైన నిషేధాజ్ఞలు వెలువరించారు. నిరసన ప్రదర్శనలకు దిగరాదు. ఎక్కువ మంది ఒక్కచోట గుమికూడరాదని నిర్ధేశించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లు అయితే అటువంటి వారిపై పలు కఠిన చర్యలు ఉంటాయి. జరిమానాల నుంచి విద్యాసంస్థ నుంచి బహిష్కరణ స్థాయి వరకూ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్యాంపస్ పరిధిలో ప్రదర్శనలకు పాల్పడరాదు.

ఇప్పటికే క్యాంపస్‌లోని నిర్వాహక సంస్థల సముదాయాలు, విసి, రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇతర చోట్ల నుంచి వంద మీటర్ల లోపు విద్యార్థులు గుమికూడరాదనే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఈ విస్తృత కట్టడికి దిగారు. ఆజ్ఞలను ధిక్కరించడం జరిగితే వారిపై రూ 20000 వరకూ జరిమానాలు విధిస్తారు. తీవ్రస్థాయి ఉల్లంఘనకు పాల్పడితే వారిని గుర్తించి బహిష్కరిస్తారు. ఎటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దిగినా, రెచ్చగొట్టేప్రసంగాలకు పాల్పడ్డా , కులాలు మతాలు, వర్గాల పేరిట దిగజార్చే వ్యాఖ్యలకుదిగినా వారిపై రూ 10000 వరకూ ఫైన్ పడుతుంది.

లేదా చట్టప్రకారం చర్యలు ఉంటాయి. ఈ అదేశాలను ఇప్పుడు యూనివర్శిటీ న్యూ మాన్యువల్‌లో పొందుపర్చారు. క్యాంపస్‌లో ఎప్పటికప్పుడు శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకునే చర్యనే ఇది అని, ప్రత్యేకత ఏదీ లేదని అధికారులు తమ ప్రకటనలో తెలిపారు. అయితే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో క్యాంపస్‌లో అవాంఛనీయ ఘటనలు చెలరేగుతాయనే వార్తల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News