Saturday, May 4, 2024

మల్లేపల్లిలో తప్పిన ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మల్లేపల్లిలో పెను ప్రమాదం తప్పింది. భాగ్యనగరంలో గత రాత్రి భారీ వర్షం కురవడంతో పాత ఇల్లు కుప్పకూలింది. కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం రావడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్డుపై మోకల్లోతు నీళ్లు నిలిచిపోయాయి.  కుండ పోత వర్షంతో విశ్వనగరం జలదిగ్బంధమైంది. మెట్రో రైలు వంతెనలు పలు చోట్ల జలపాతాలను తలపించాయి. అంతేకాకుండా వర్షం ధాటికి కాలనీలు, రోడ్లలన్నీ పూర్తిగా కుంటలుగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News