Saturday, May 4, 2024

ఇంకెంత కాలం మెహబూబా ముఫ్తి నిర్బంధం

- Advertisement -
- Advertisement -
How long will Mehbooba Mufti be detained
సుప్రీంకోర్టులో ముఫ్తి కుమార్తె పిటిషన్

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు ప్రజా భద్రతా చట్టం కింద తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తిని నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తి దాఖలు చేసిన సవరణ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలంటూ జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. గత ఏడాది అగస్టు 5వ తేదీన తన తల్లిని నిర్బంధంలో ఉంచారని, ఇలా ఎంతకాలం కొనసాగిస్తారని, ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొనాలని కోరుతూ ఇల్తిజా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్‌కె కౌల్, జస్టిస్ హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం సమాధానం ఇవ్వడానికి జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగానికి 15 రోజులు వ్యవధి ఇచ్చింది. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని ఎంతకాలం నిర్బంధంలో ఉంచుతారని, మెహబూబా ముఫ్తి నిర్బంధాన్ని కొనసాగించే విషయమే స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా పార్టీ సమావేశాలకు మెహబూబా హాజరు కావడానికి అనుమతించాలన్న అభ్యర్థనపై సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కోర్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News