Monday, April 29, 2024

బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

huge fire broke out in Bollaram police station

బోయిన్‌పల్లి: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బొల్లారంలో ఓ పాత ఇనుప సామానుదుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని పక్కనే ఉన్న వైన్‌షాపులోకి మంటలు చేలరేగి వైన్స్ షాపులోని స్టాకు పూర్తిగా దగ్ధమైన ఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో సమాచారం అందుకున్న సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని రెండు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదే కాకుండా ఆర్మీకి చెందిన మరో వాహనంతో సైతం మంటలను సుమరు 4 గంటల పాలు శ్రమించి ఆదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో సుమారు ముప్పై నుంచి నలబై లక్షల రూపాలయ నష్టం జరగవచ్చని అంచన వేస్తున్నారు. దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరగిందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం వేళలో జరగటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News