Saturday, April 27, 2024

దగ్దమైన గుడిసెల బాధితులకు బండి పరామర్శ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : అగ్ని ప్రమాదంలో గుడిసెల దగ్దమై సర్వస్వం కోల్పోయిన వడ్డెర బాధిత కుటుంబాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. దగ్దమైన గుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు సంజయ్ వద్దకు వచ్చి తాము సర్వస్వం కోల్పోయామని వాపోయారు. కష్టపడి దాచుకున్న బంగారంతోపాటు ఉపాధి కల్పిస్తున్న యంత్రాలను, వాహనాలు సైతం అగ్ని ప్రమాదంలో దగ్దమయ్యాయని వాపోయారు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో తమకు తాత్కాలిక బసను కల్పించడంతోపాటు భోజన వసతిని మీరే(బండి సంజయ్) కల్పించారని, నిత్యా వసర వస్తువులు, వంట సామాగ్రి అందించారని పేర్కొన్న బాధితులు మీకు రుణపడి ఉంటామని బండి సంజయ్ కు చేతులె త్తి నమస్కరించారు. కోల్పోయిన గుడిసెలను మళ్లీ వేసుకోవాలనుకుంటున్నామని, ఆదుకోవాలని కోరారు. సానుకూ లంగా స్పందించిన బండి సంజయ్ అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

గుడిసెలు వేసుకుని తిరిగి జీవనాన్ని కొనసాగిం చేందకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడు తూ ‘కరీంనగర్‌లో గత రెండు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని వడ్డెరలు నివసిస్తున్నరు. మేడారం సమ్మక్క సారలమ్మ జాత రకు బయలుదేలోరిన వెళ్లిన సమయంలో వారు నివాసం ఉంటున్న గుడిసెలన్నీ సిలిండర్ పేలి దగ్దమయ్యాయి. నిత్యావసర వస్తువులు, దాచుకున్న గోల్ సహా సర్వస్వం కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ పక్షాన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలందించాం అన్నారు. వారికి తిరిగి గుడిసెలు వేసుకునేందుకు సాయం చేస్తాం. ఉపాధికి అవసరమైన యంత్రా లను కోల్పోయారు. వాటిని కూడా అవసరమైన మేరకు సమకూరుస్తాం అన్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహాయ సహకా రాలు అందించాలని కోరుకుంటున్నా.”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News