Monday, April 29, 2024

పుంజుకుంటున్న మెట్రో….

- Advertisement -
- Advertisement -
Hyderabad Metro Suvarna Offer 2021
సువర్ణ ఆఫర్‌ను ఆదరిస్తున్న నగరవాసులు
ఇప్పటివరకు 2లక్షల మంది కొనుగోలు
15జనవరి 2022వరకు అందుబాటులో ఆఫర్
ఇంధన ధరల మోతతో మెట్రో వైపు వెళ్లుతున్న వాహనదారులు
20ట్రిప్పులకు కొనుగోలు చేస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులకు అవకాశం

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రోజు లక్షలాది మంది ప్రయాణికులను పలు ప్రాంతాలకు చేరవేస్తుంది. రెండు నెల కితం మెట్రో ప్రవేశ పెట్టిన సువర్ ఆఫర్‌కు ఆశించిన స్దాయిలో జన ఆదరణ పొందుతున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు 2 లక్షల మంది ఆఫర్ కార్డులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. జనవరి 15వరకు మరో 1.50 లక్షల వరకు ప్రయాణికులు ఆఫర్ కార్డులు తీసుకోవచ్చని మెట్రో సిబ్బంది భావిస్తున్నారు. కోవిడ్ మహమ్మారితో నష్టాలు చవిచూసిన మెట్రో కొత్త పథకాలు తీసుకరావడంతో నగర ప్రజలు మెట్రో ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు పలువురు ప్రయాణికులు వెల్లడిస్తున్నారు. గత నెల నుంచి మెట్రో రైల్ సేవలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించడంతో ప్రయాణీకులు సంఖ్య రోజుకు 2.60 లక్షల వరకు చేరుగా, నూతన పథకాలతో మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రోజుకు 3 లక్షల మంది చేరుకునేలా చేస్తామని, ప్రయాణికులు సులువుగా ఉండే విధానాలు తీసుకొస్తే తమ లక్షం చేరుకుంటామని వెల్లడిస్తున్నారు. సువర్ణ ఆఫర్ 15 జనవరి 2022వరకు ఉంటుందని ప్రయాణికులు కొనుగోలు చేసి మెట్రో సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నారు. మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి 45 రోజుల పాటు తిరగవచ్చని మెట్రో స్మార్ట్ కార్డ్‌పై మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. అదే విధంగా ఆకర్షనీయమైన బహుమతులను ప్రతి నెల గెలుచుకునే అవకాశం కల్పిస్తూ ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సిఎస్‌సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తున్నామని గత నెలల్లో తీసిన డ్రాలో ఐదుగురుకి బహుమతులు అందజేసినట్లు మెట్రో ఉన్నతాదికారులు వెల్లడిస్తున్నారు. వీరు ఓక్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సిఎస్‌సీ (కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డు)లను టీ సవారీ, మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి సూచిస్తున్నారు. అదే విధంగా కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తామని, స్టేషన్ల వద్ద మాస్కులు, శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నట్లు, వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News