Tuesday, April 30, 2024

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని క్లేవ్‌ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్‌లో వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన మహ్మమద్ అబ్దుల్ అర్ఫాత్ క్లేవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నాడు. అర్ఫాత్ మార్చి 7వ తేదీ నుంచి కనిపించడంలేదు. గుర్తు తెలియని వ్యక్తి అర్ఫాత్ తండ్రి సలీంకు ఫోన్ చేసి 1200 డాలర్లు ఇస్తే కుమారుడిని పంపిస్తామని లేకపోతే కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించారు. డబ్బులు పంపిస్తామని చెప్పామని, అర్ఫాత్ కిడ్నాపర్ల ఆధీనంలో ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు చూపమని అడిగాం, కానీ దుండగులు ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ పెట్టేవారు. మళ్లీ వాళ్లు తమకు కాల్ చేయలేదని, కిడ్నాపర్లు మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌లో ఏడుపు వినిపించిందని, ఆ నంబర్‌ను తమ బంధువులకు పంపి, పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పామని సలీం పేర్కొన్నారు.
మార్చి 8వ తేదీన క్లైవ్ ల్యాండ్ పోలీసులకు సలీం బంధువులు ఫిర్యాదు చేశారు. అర్ఫాత్ మృతదేహం కనిపించిందని భారత దౌత్య కార్యాలయం అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని భారత్ కు తరలించడానికి సహాయం చేస్తున్నామని అధికారులు వివరించారు. గత మూడు నెలల నుంచి 11 మంది భారతీయులు అమెరికాలో చనిపోయారు. అమెరికాలో భారతీయ పౌరులకు రక్షణ లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News