Saturday, May 4, 2024

భాగ్యనగర్ ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

- Advertisement -
- Advertisement -

.ఎటిఎస్ విచారణలో .
మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లలో నిందితులకు శిక్షణ
యువతను ఇస్లామిక్ రాడికల్ దిశగా మళ్లింపుకు యత్నం
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ప్రణాళికలు
కోడ్ భాషపై ఆరా.. నిందితులకు శిక్షణనిచ్చిన జిమ్ ట్రైనర్ యాసిర్ కోసం ఎటిఎస్ వేట
భాగ్యనగర్ ఉగ్ర కుట్ర కేసులో హిజ్బ్ ఉత్ తహ్రీర్ కేసులో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ , తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. హైదరాబాద్‌లో అరెస్టైన రాడికల్ ఇస్లామిక్ (హెచ్‌యూటి) ఉగ్రవాదుల విచారణలో పోలీసులు కీలక విషయాలు కనుగొన్నారు. హైదరాబాద్‌లో దాడులు చేసేందుకు సలీం, సల్మాన్ కీలకంగా వ్యవహరించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఇద్దరు నింది తులు మెహిదీపట్నంలోని పిస్టల్ షూటింగ్ సెంటర్‌లో వారం పాటు శిక్షణ తీసుకున్నట్లు గుర్తించారు.సెంటర్ నిర్వాహకులు ఆధార్, ఇతర చిరునామా వివరాలు అడగడంతో అక్కడ శిక్షణ మానేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆత్మరక్షణ పేరుతో ముస్లిం యువతకు దేహ దారుఢ్యంపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. దీని ద్వారా యువతను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారని విచారణలో తేలింది.

ఓయూలోని ఓ మైదానంతో పాటు శామీర్ పేట్ లోని నిర్మానుష్య ప్రాంతాల్లోనూ యువతకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిందితులు అందరూ ఏడాదిన్నర కాలం నుంచి ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు ఇంటెలిజెన్స్ బృందం గుర్తించింది. అలాగే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ శివారులో నిందితులు శిక్షణ పొందినట్టుగా గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్ పుర, బోజ్పుర శివారు నీమేడా గ్రామంలో శిక్షణ పొందారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయని సమాచారం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధ్వంసం కోసం నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా విచారణ చేస్తున్నాయి. నిందితులు ఉపయోగించిన కోడ్ భాషపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. బిర్యానీ, లడ్డూ వంటి కోడ్ భాషలపై దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. మొబైల్ లో డేటాను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని డ్యామ్‌లు, స్టేడియాల్లో నిందితులు విధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నాయి. కాగా,నిందితులకు జిమ్ ట్రైనర్ యాసిర్ నుండి ఆదేశాలు వచ్చిన విషయాన్ని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. యాసిర్ కోసం ఎటిఎస్ గాలింపు చర్యలు చేప ట్టింది. దాదాపుగా రెండేళ్లుగా హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న హెచ్‌యూటి ఉగ్రవాదులపై ఎటిఎస్ నిఘా పెట్టింది. దేశంలో పెను విధ్వం సం సృష్టించడానికి మూడంచెల విధానాలను అనుసరిస్తూ ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్రణాళికలు రచించారు. ఇందులో తొలి దశలో యువ తను ఆకర్షించి, తమవైపు తిప్పుకుంటారు. రెండో దశలో వారికి సాంకేతిక, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారు. మూడో దశలో దాడి ఎలా చేయాలో ప్రణాళికలు రచిస్తారు. ఇవే హిజ్బ్ ఉత్ తహ్రీర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News