Friday, April 26, 2024

దాచారంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేస్తున్న ఎంపిటిసి, సర్పంచ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో రేషన్ కార్డులు లేని 10 కుటుంబాలకు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం నిత్యావసర వస్తువులు అందించారు. మోత్కూరు మండలంలోని పాటిమట్ల, సదర్శాపురం, దాచారం గ్రామాలలో సర్పంచ్ అండెం రజితా రెడ్డి,  ఎంపిటిసి సభ్యులు రచ్చ కల్పన లక్ష్మీనర్సింహ్మారెడ్డి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోదించేందుకు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. పాటిమట్ల గ్రామంలో ప్రజలకు సి విటమిన్ అందించే బత్తాయి పండ్లు, కూరగాయలను రచ్చ కల్పన పంపిణీ చేశారు.

దత్తప్పగూడెంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోదించేందుకు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిదిలోని ఆరెగూడెంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోదించేందుకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి వీధిలో పిచికారీ చేయించారు. ప్రజల సంక్షేమంగా ఉండటం కోసమే ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయని ప్రజలు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్య, పారిశుద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఎస్‌ఐ సిహెచ్. హరిప్రసాద్‌ను పాటిమట్ల గ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త రచ్చ లక్ష్మీనర్సింహ్మారెడ్డి  శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సిహెచ్.హరి ప్రసాద్, దత్తప్పగూడెం, పాటిమట్ల, దాచారం, సదర్శాపురం గ్రామాల సర్పంచ్‌లు ఎలుగు శోభ, దండెబోయిన మల్లేష్, అండెం రజిత రాజిరెడ్డి, వర్రె కవిత, నాయకులు గజ్జి మల్లేష్, దామరోజు శ్రీకాంతచారి, జానారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నరేష్, నర్సింహ్మా, రవి, మున్సిపల్ సిబ్బంది, హన్మకొండ నర్సింహ్మాచారి తదితరులు పాల్గొన్నారు.

 

Hypochloride spray in Dacharam by MPTC, Sarpanch

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News