Sunday, May 12, 2024

నేనింకా రిటైర్ కాలేదు

- Advertisement -
- Advertisement -
I didn't announce any retirement Says Chris Gayle
ఆ హడావుడి అంతా అందుకే: క్రిస్ గేల్

దుబాయి: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను ఖండించాడు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశాడు. టి20 ప్రపంచకప్ తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకోనున్నట్లు వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం బ్రావో, క్రిస్ గేల్‌కు సహచర ఆటగాళ్లనుంచి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ లభించింది. దీంతో గేల్ కూడా రిటైర్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు బ్యాటింగ్ సమయంలో తన బ్యాట్ ఎత్తి ప్రేక్షకులకు చూపిస్తూ అభివాదం చేయడం, తన గ్లోవ్స్‌పై సంతకం చేసి ప్రేక్షకులకు ఇవ్వడం వంటి చర్యలు కూడా గేల్ రిటైర్మెంట్ వార్తలకు బలం చేకూర్చాయి.

అలాగే బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్‌ను ఔట్ చేశాక అతను వెళ్లూ వెళ్తూ గేల్‌ను హగ్ చేసుకోవడం వంటివి అందరినీ ఆకర్షించాయి. ఇవన్నీ చూసిన అభిమానులు గేల్ తన చివరి మ్యాచ్ ఆడేశాడని, రిటైర్మెంట్ ప్రకటించేశాడనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన గేల్ ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు. టి20 ప్రపంచకప్ చివరి మ్యాచ్‌ని ఎంజాయ్ చేశానంతేనని పేర్కొన్నాడు. తన ఫేర్‌వెల్ మ్యాచ్ తన స్వస్థలమైన జమైకాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News