Wednesday, May 15, 2024

బోర్‌గా ఫీలవుతున్నా: స్టీవ్ స్మిత్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: కరోనా వల్ల దేశంలో లాక్‌డౌన్ విధించడంతో తాను ఇంటికే పరిమితమయ్యానని, దీంతో ఎంతో బోర్‌గా ఫీలవుతున్నానని ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ వాపోయాడు. రోజుల తరపడి ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానన్నాడు. ఈ ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అంతుబట్టడం లేదన్నాడు. అయితే కరోనా వంటి మహమ్మరిని అరికట్టాలంటే లాక్‌డౌన్ వంటి కఠిన ఆంక్షలు అమలు చేయక తప్పదన్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇంటికే పరిమతయ్యారన్నాడు. ఇందులో తాను కూడా ఒకడన్నాడు. అయితే గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొలేదని, దీంతో ఇంటిలోనే ఉండాల్సి రావడం ఆవేదన కలిగిస్తుందన్నాడు. కాగా, త్వరలోనే పరిస్థితులు మాములుగా మారుతాయనే నమ్మకాన్ని స్మిత్ వ్యక్తం చేశాడు. కాగా, కరోనా వల్ల ప్రపంచం అంత అల్లకల్లోలంగా మారిందన్నాడు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదన్నాడు. దీంతో లాక్‌డౌన్ వంటి కఠిన నిబంధనలు విధించక తప్పలేదన్నాడు. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని దీన్ని విజయవంతం చేయాలన్నాడు. కాగా, పరిస్థితులు మారి త్వరలోనే క్రికెట్‌తో సహా అన్ని క్రీడలు తిరిగి ప్రారంభం అవుతాయనే నమ్మకాన్ని ఈ మాజీ కెప్టెన్ వ్యక్తం చేశాడు.

I Feel Bored Amid Lockdown: Steve Smith

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News