Monday, April 29, 2024

అల్మాస్‌గూడలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

dead

 

హైదరాబాద్: నగరంలోని అల్మాస్‌గూడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం… మీర్‌పేట అల్మాస్‌గూడలో ఉంటున్న హరీష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు సువర్ణబాయి(60), హరీష్(30), గిరీష్(25), స్వప్న(28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Four Same Family Members Attempt Suicide in Almasguda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News