Monday, April 29, 2024

బస్‌పాస్‌లకు పెరుగుతున్న ఆదరణ

- Advertisement -
- Advertisement -

Increase in TSRTC Bus Passes in Hyderabad

హైదరాబాద్: గ్రేటర్‌హైదరాబాద్‌లో అధికారులు ప్రారంభించిన బస్‌పాస్ కౌంటర్లకు అన్ని ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గ్రేటలో 39 రూట్లలో సుమారు 730 బస్సులను నడుపుత్ను అధికారులు సెప్టెంబర్ 26 నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతా రైతిఫిల్, ఈసిఐల్, ఉప్పల్, దిల్‌సుక్‌నగర్, మెహదీపట్నం, సిబిఎస్ టర్మినల్, పటాన్ చెరు, ఇబ్రహీంపట్నం ,కేపిహెచ్‌బి, షాపూర్‌నగర్,మేడ్చెల్, శంషాబాద్, అఫ్జల్‌గంజ్ ,వనస్థలిపురం, హయత్‌నగర్ వంటి 15 ప్రాంతాల్లో బస్‌పాస్ కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం కాలేజీలు, స్కూళ్ళు కరోనా ప్రభావంతో కారణంగా మూసివేయడంతో తాము ప్రతిరోజు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్ళే వారిని దృష్టిలో పెట్టుకుని కేవలం మాత్రమే బస్‌పాస్ కౌంటర్లను ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు.

సాధారణ రోజుల్లో గ్రేటర్‌లో 3 లక్షల బస్‌పాస్‌లను నగర వ్యాప్తంగా ఉన్న 50 కేంద్రాల ద్వారా జారీ చేస్తామని వాటి ద్వారా సంస్థకు సుమారు రూ.75 నుంచి 90 లక్షల వరకు ఆదాయం వచ్చేదని కాని ప్రస్తుత బస్‌పాస్ కేంద్రాల ద్వారా సంస్థకు సుమారు 25 నుంచి 30 లక్షల వరకు ఆదాయం వస్తోందని రానున్న రోజుల్లో మరి కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రారంభం రోజుల్లో కేవలం 5 నుంచి 15 లక్షల రూపాయల వరకు మాత్రమే రాగా కొద్ది రోజులు బస్‌పాస్‌ల ద్వారా ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

త్వరలో వీటి సంఖ్యను పెంచుతాం…

బస్‌పాస్ కేంద్రాల సంఖ్యను కొద్ది రోజుల్లో పెంచుతామని, ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి ప్రయాణికులు వస్తున్నారని వారిని దృష్టిలో పెట్టుకుని డిమాండ్‌కు అనుగుణంగా వాటి సంఖ్యను కూడా పెంచుతామన్నారు. ఆర్టిసి బస్‌ల సంఖ్యను కూడా పరీశీలిస్తున్నామని, ప్రస్తుతం నడుసున్న రూట్లలో బస్సుల సంఖ్యను 10 నుంచి 15 శాతం వరకు పెంచుతామ, ఈ విధంగా పెంచుకుంటూ క్రమేపి ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో బస్సులను తిప్పుతామని అధికారులు చెబుతున్నారు.

మార్చి 22 నుంచి గ్రేటర్‌లో బస్‌లు తిరగని కారణంగా బస్‌పాస్‌ల గడువు ముగయక పోవడంతో ప్రయాణికులు సుమారు 10 నుంచి 15 రోజులు నష్టపోవాల్సి వచ్చిందని. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నామని వీటి గడువు తేది అంశంపై ఇప్పటికే ఉన్నతాధికారులుకు సమాచారం ఇచ్చామని,మార్చి 22 నాటికి గడువు తేదీ ముగియకుండా ఉన్న బస్‌పాస్‌ల వివరాలను ఉన్నతాధికారులకు కూడా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి గడువుతేదీకి సంబంధించిన ఆదేశాలు వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News