Monday, April 29, 2024

రోహిత్ రికార్డు శతకం.. 144 పరుగుల ఆధిక్యంలో భారత్

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా రెండోరోజూ పైచేయి సాధించింది. కంగారూలపై ఆధిపత్యాన్ని కొనసాగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ బంతుల్లో 15ఫోర్లు, 2సిక్స్‌లతో సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. మిడిలార్డర్ విఫలమైనా టెయిలెండర్లు కంగారూలపై ఆధిపత్యాన్ని చెలాయించారు. స్టార్ రౌండర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 9బౌండరీలోతో 66 పరుగులు, అక్షర్‌పటేల్ 102బంతుల్లో 8బౌండరీలతో 52పరుగులు చేసి అజేయ అర్ధశతకాలతో కొనసాగుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 114ఓవర్లలో 7వికెట్లకు 321పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ 5వికెట్లను ఘనతను అందుకోగా లియోన్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. భారత్ 144పరుగుల ఆధిక్యంలో కొనసాగుతూంది.

కోహ్లీ, సూర్య, శ్రీకర్ విఫలం
ఓవర్‌నైట్ స్కోరు 77/1తో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్ అశ్విన్ అండతో రోహిత్ చెలరేగిపోయాడు. ఈ జోడీని మర్ఫీ విడదీశాడు. వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఔట్ చేశాడు. పుజారా కోహ్లీ నిరాశపరిచారు.భారత్ 151పరుగులకు 3వికెట్లను కోల్పోయి వెళ్లింది. విరామం అనంతరం ప్లేయర్ సూర్య లియోన్ బౌల్డ్ చేశాడు. 168పరుగులకే భారత్ 5వికెట్లు కోల్పోయింది. మరోవైపు రోహిత్ ఎదురుదాడికి దిగి సెంచరీ సాధించాడు. ఓపెనర్‌గా రోహిత్‌కు ఇది 6వ శతకం కాగా 9వ టెస్టు సెంచరీ. బౌలింగ్‌లో రోహిత్ బౌల్డ్ అయ్యాడు. అనంతర శ్రీకర్ భరత్ (8)ను మర్ఫీ ఔట్ చేశాడు. దీంతో240పరుగుల వద్ద టీమిండియా వికెట్ పడింది. ఈదశలో అక్షర్, రవీంద్ర జడేజా జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు.

రోహిత్ సూపర్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ టెస్టులో సూపర్ సెంచరీ నమోదు చేశాడు. హిట్‌మ్యాన్ అరుదైన సెంచరీతో భారత్ కంగారూలపై భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ (120) శతకాన్ని నమోదు చేశాడు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రోహిత్ సెంచరీని అందుకున్నాడు. 2021లో ఇంగ్లాండ్‌పై సెంచరీ చేసిన తాజాగా ఆస్ట్రేలియాపై కీలక సెంచరీని సాధించాడు. బౌలర్లుకు అనుకూలిస్తున్న నాగ్‌పూర్ పిచ్ బ్యాటర్లు చేతులెత్తేయగా సూపర్ సెంచరీతో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన భారత కెప్టెన్‌గా రోహిత్‌శర్హ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో బాబర్, డుప్లెసిస్, తిలరత్నే దిల్హాన్ ఉండగా వీరి సరసన రోహిత్‌శర్మ కాగా రోహిత్ అన్నిఫార్మాట్లలో మొత్తం 43 సెంచరీలను పూర్తిచేశాడు. టెస్టుల్లో 9, వన్డేల్లో 30, పొట్టి ఫార్మాట్ టి20ల్లో 4సెంచరీలు సాధించాడు. ఈక్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ 42సెంచరీలను రికార్డును రోహిత్ అధిగమించాడు.

జడేజా కత్తిసాము
తొలిటెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటుతోనూ అదరగొడుతున్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి మెరిసిన జడేజా అనంతరం బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా కొనసాగుతున్నాడు. హాఫ్ సెంచరీ, సెంచరీ సాధించిన ప్రతిసారి జడ్డూ తనశైలిలో సంబరాలు చేసుకుంటాడు. బ్యాట్‌ను కత్తిలా తిప్పి అభిమానులను అలరిస్తాడు. 93వ ఓవర్లో బోలాండ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి సింగిల్ తీసిన జడేజా పూర్తి చేసుకున్నాడు. అభిమానుల హర్షధ్వానాల మధ్య తనదైన శైలిలో బ్యాట్‌ను కత్తిలా ఝుళిపించి సంబరాలు చేసుకున్నాడు.

మర్ఫీ పాంచ్ పటాకా
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్ర బౌలర్ టాడ్ మర్ఫీ సత్తా చాటాడు. డెబ్యూ టెస్టులో స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో మెరిశాడు. భారత బ్యాటర్లకు సవాల్‌గా నిలిచాడు. అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన నాలుగో ఆఫ్ స్పిన్నర్‌గా మర్ఫీ నిలిచాడు. కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, పుజారా, వికెట్‌కీపర్‌గా సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ వికెట్లను టాడ్ మర్ఫీ తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను చెదరగొట్టిన మర్ఫీ 9మెయిడిన్లతోపాటు పడగొట్టాడు. 36ఓవర్లలో 82పరుగులిచ్చి వికెట్లు తీశాడు. కెప్టెన్ కమిన్స్, బోలాండ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News