Saturday, May 11, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 6822 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. అయితే, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాత్రం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 6,822 మందికి కరోనా వైరస్ సోకగా 220మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 3.46కోట్లకు చేరుకోగా, 4.73లక్షలకు పైగా మంది బాధితులు మృతి చెందారు. గత 24 గంటల్లో 10,004మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.40కోట్లకు పైగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 95,014 యాక్టీవ్ చేసులు ఉన్నాయి. దేశ ప్రజలకు ఇప్పటివరకు 128.76 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

India reports 6822 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News