Monday, April 29, 2024

భారత్‌కు మరో మూడు ‘పతకాలు’

- Advertisement -
- Advertisement -

India wins three more medals at Paralympics

హైజంప్‌లో ప్రవీణ్‌కు రజతం
షూటింగ్‌లో అవనికి కాంస్యం, ఆర్చరీలో కాంస్యం గెలిచిన హర్విందర్

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ మరో మూడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. పురుషుల హైజంప్‌లో యువ అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రజతం సాధించాడు. ఇక షూటింగ్‌లో అవని లేఖర ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్ విభాగంలో అవని కాంస్య పతకం గెలిచింది. ఒక భారత క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలవడం ఇదే తొలిసారి. మరోవైపు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ పోటీల్లో హర్దిందర్ సింగ్ కాంస్యం గెలిచి సత్తా చాటాడు. ఈ క్రమంలో పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్‌కు పతకం అందించిన తొలి క్రీడాకారుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కిందటి పారాలింపిక్స్‌లో భారత్ కేవలం 4 పతకాలు మాత్రమే సాధించింది. ఈసారి అసాధారణ ఆటతో ఏకంగా 13 పతకాలు గెలిచి చరిత్ర సృష్టించింది.

అదరగొట్టిన ప్రవీణ్

పురుషుల హైజంప్‌లో భారత యువ అథ్లెట్ ప్రవీణ్ కుమార్ అదరగొట్టాడు. శుక్రవారం జరిగిన టి64 హైజంప్‌లో ప్రవీణ్ కుమార్ అద్భుతం చేశాడు. ఆరంగేట్రం పారాలింపిక్స్‌లోనే పతకం గెలిచి సత్తా చాటాడు. ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 18 ఏళ్లకే పారాలింపిక్స్‌లో పతకం గెలిచి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు 2.10 మీటర్లు గెత్తి జొనాథన్ బూమ్ స్వర్ణం గెలుచుకున్నాడు. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా పారాలింపిక్స్ బరిలో దిగిన ప్రవీణ్ ఏకంగా రజతం నెగ్గి భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. ఇక ప్రవీణ్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు ప్రవీణ్‌కు ప్రశంసలతో ముంచెత్తారు.

India wins three more medals at Paralympics

చరిత్ర సృష్టించిన అవని

మరోవైపు మహిళల షూటింగ్‌లో అవని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలిచిన అవని తాజాగా మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 50 మీటర్ల విభాగంలో అవని మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో అవని 445.9 పాయింట్లతో కాంస్యం సాధించింది. ఇదే సమయంలో పారాలింపిక్స్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా అవని అరుదైన ఘనతను సాధించింది.

India wins three more medals at Paralympics

హర్విందర్ హవా..

ఇక పురుషుల ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత క్రీడాకారుడు హర్విందర్ సింగ్ కాంస్యం సాధించాడు. కొరియా ఆర్చర్ కిమ్‌తో కాంస్యం కోసం జరిగిన పోరులో హర్విందర్ 65 తేడాతో విజయం సాధించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఆసక్తికర సమరంలో హర్విందర్ 2624, 2729, 2825, 2225, 2627, 108 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. ఇక పారాలింపిక్స్ ఆర్చరీలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News