Saturday, April 27, 2024

‘నాసా ’యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా భారతీయ అమెరికన్ భవ్యాలాల్

- Advertisement -
- Advertisement -

Indian-American Bhavya Lal as NASA Acting Chief of Staff

 

భారతీయ మహిళా శాస్త్రవేత్తకు దక్కిన అపూర్వ గౌరవం

వాషింగ్టన్ : భారతీయ అమెరికన్ మహిళ, శాస్త్రవేత్త భవ్యాలాల్ అమెరికా అంతరిక్షపరిశోధన సంస్థ నాసాకు యాక్టింగ్ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు. ఇంజినీరింగ్, అంతరిక్ష విజ్ఞాన రంగాల్లో భవ్యకు సుదీర్ఘ అనుభవం ఉందని, నాసాకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆమె 2005 నుంచి 2020 వరకు ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ అనాలసిస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇనిస్టిట్యూట్ పరిశోధనా సంస్థల్లో సభ్యురాలిగా సేవలు అందించారు. అలాగే వైట్‌హౌస్‌కు చెందిన ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, నేషనల్ స్పేస్ కౌన్సిల్‌లకు విశ్లేషకుల బృందానికి నాయకత్వం వహించారు. అంతేకాక అంతరిక్ష సాంకేతిక విధాన సంఘం క్రియాశీలక సభ్యురాలిగా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన ఐదు కమిటీలకు సభ్యురాలిగా, అధ్యక్షురాలిగా కీలక పదవుల్లో ఉన్నారు. నాసాలో కూడా వివిధ బాధ్యతలు నిర్వహించారు.

స్పేస్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఎస్‌టిపిఐ) లో చేరేముందు భవ్యాలాల్ సిఎస్‌టిపిఎస్ ఎల్‌ఎల్‌సికి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. దానికి ముందు సెంటర్ ఫర్‌సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టడీస్ కు డైరెక్టర్‌గా పనిచేశారు. మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ మాస్టర్స్‌తోపాటు టెక్నాలజీ అండ్ పాలసీ విభాగంలో కూడా మరో మాస్టర్స్ పట్టాను కూడా భవ్య అందుకున్నారు. జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డాక్టరేట్ పూర్తి చేశారు. న్యూక్లియర్ ఇంజినీరింగ్ సొసైటీ, పబ్లిక్ పాలసీ సొసైటీ ఈ రెండింటిలోనూ ఆమెకు గౌరవ సభ్యత్వం ఉంది. అంతరిక్ష విజ్ఞాన రంగంలో అనేక సేవలు అందించినందుకు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ గౌరవ సభ్యురాలిగా భవ్య ఎన్నికయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News