Saturday, May 4, 2024

స్పెల్లింగ్ బీ పోటీల్లోసత్తా చాటిన భారత బాలలు

- Advertisement -
- Advertisement -

Indian-American winners of spelling bee 2022

తొలి రెండు స్థానలు వారివే
90 సెకన్లలో 21 పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్ చెప్పి విజేతగా నిలిచిన హరిణి లోగస్

హోస్టన్: 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన చిన్నారులు మరోసారి సత్తా చాటారు. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో టెక్సాస్ లోని ఆంటోనొయోకు చెందిన హరిణి లోగస్(14) విజేతగా నిలవగా, మరో భారత సంతతి బాలుడు డెనవర్‌కు చెందిన విక్రమ్ రాజు(12)రెండో స్థానంలో నిలిచాడు. విజేతను నిర్ణయించే చివరి రౌండ్ 90సెకన్లలో హరిణి ఏకంగా 21 పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పడం గమనార్హం. కాగా రెండో స్థానంలో నిలిచిన విక్రమ్ రాజు15 పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పాడు.12 మంది ఫైనలిస్టులతో కలుపుకొని ఈ పోటీలో పాల్గొన్న 230 మందిని వెనక్కి నెట్టి హరిణి అందరికంటే ఎక్కువ పదాలకు స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పడం గమనార్హం. హరిణికి నిర్వాహకులలు జ్ఞాపికతో పాటుగా రూ.38 లక్షల(50,000డాలర్ల )నగదు పారితోషికం అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన విక్రమ్ రాజుకు రూ.22 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక గత ఏడాది జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లోను భారతీయ విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. మొత్తం 11 మంది ఫైనలిస్టుల్లో 9 మంది భారత సంతతి బాలలు ఉన్నారు. అయితే అప్పుడు లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్ గార్డె(14) విజేతగా నిలిచింది. భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నరప్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ ఈ ఏడాది భారత సంతతి బాలలు విజేతలుగా నిలిచి సత్తా చాటారు. కాగా స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొనడం ఇది నాలుగో సారని, విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉందని హరిణి చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News