Friday, May 10, 2024

ఇంటి వద్దనే.. సరదా.. సరదాగా

- Advertisement -
- Advertisement -

ముంబయి: కరోనా వల్ల దేశ వ్యాప్తంగా కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్‌తో సహా అన్ని క్రీడలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దీంతో క్రీడాకారులందరూ ఇంటికి పరిమితమయ్యారు. ఇక, ఎప్పుడూ ఎడతెరిపి లేని క్రికెట్‌తో తీరిక లేకుండా ఉండే టీమిండియా క్రికెటర్లకు కరోనా వల్ల కావాల్సినంత విశ్రాంతి లభించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో క్రికెటర్లందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ బిజీగా ఉండే క్రికెటర్లు కొన్ని నెలలుగా ఇళ్లకే పరిమితం కాక తప్పలేదు. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.

దీంతో క్రికెట్ సిరీస్‌లకు, టోర్నీలకు అవకాశం లేకుండా పోయింది. ఇక, క్రికెటర్లు ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఉపయోగించుకుంటున్నారు. కరోనా వల్ల బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడడంతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో గడపక తప్పడం లేదు. ఇక, విరుష్క దంపతులు లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన ఖాళీ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. ఇటు విరాట్ అటు అనుష్క శర్మలు తమ తమ విధుల్లో ఎప్పుడూ బీజీగా ఉండేవారు.

https://www.instagram.com/p/B_cqubzHhEo/

కానీ, కరోనా వల్ల వీరికి ఎక్కువ రోజు కలిసి ఉండే అవకాశం లభించింది. ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా తన కూతురు జీవా, భార్య సాక్షితో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా తాను తీసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు.

 

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, యువ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్.రాహుల్, సీనియర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా తదితరులు కూడా ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు కేటాయించారు. ఇళ్ల వద్దే ఉంటూ సరదాగా తీసిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Indian Cricketers spends time at Home Amid Lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News