Tuesday, April 30, 2024

చైనీయులకు ఇ-వీసా బంద్

- Advertisement -
- Advertisement -

బీజింగ్: కరోనా వైరస్ భయాల నేపథ్యంలో చైనా పౌరులకు భారతదేశం ఇ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనావారికి, చైనాలోని విదేశీయులకు ఈ చర్యతో ఇప్పుడు వీసాలు ఇవ్వబడవు. విస్తరిస్తోన్న కరోనా వైరస్‌తో ఇప్పటికే 300 మంది మృతి చెందారు. పలువురు ఆసుపత్రులలో ప్రత్యేక అత్యవసర చికిత్సలు పొందుతున్నారు. ప్రస్తుత నిర్థిష్ట పరిణామాలతో ఇ వీసాలతో ఇండియాలోకి చైనా వారు లేదా చైనా నివాసితులు ఇండియాకు వెళ్లడాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని , ఇది తక్షణం అమలులోకి వస్తుందని చైనాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. ఈ పరిధిలోకి వచ్చే వారు ఇప్పటికే ఈ ఇ వీసాలను పొందినా, అవి చెల్లనేరవని భావించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు. అయితే తప్పనిసరి పరిస్థితులలో చైనీయులు లేదా చైనాలోని విదేశీయులు ఇండియాకు వెళ్లాల్సి ఉంటే వారు భారతీయ ఎంబస్సీ లేదా కాన్సులేట్లను సంప్రదించవచ్చునని, అంతేకాకుండా ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్‌ల వారిని కలవవచ్చునని వెల్లడించారు. చైనా నుంచి ప్రపంచంలోని పలు ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాపిస్తోంది.

వూహాన్ నగరం ఈ వైరస్‌కు కేంద్రంగా ఉండటంతో అక్కడి 300 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి ప్రత్యేక విమానాలలో తీసుకువస్తున్నారు. వూహాన్‌లో ఉన్న 323 మంది భారతీయుల రెండో బృందంతో ఆదివారం ఒక విమానం ఇండియాకు చేరింది. వీరితో పాటు ఏడుగురు మాల్దీవుల పౌరులను కూడా ఇండియాకు చేర్చారు. దీనితో వూహాన్ నుంచి తరలించిన భారతీయుల సంఖ్య 654కు చేరింది. ఎయిరిండియాకు చెందిన జంబో 747 ద్వారా ఇప్పటికే రెండు సార్లు వూహాన్ నుంచి భారతీయులను సురక్షితంగా చేర్చారు. శనివారం తెల్లవారుజామున 324 మందిని, ఆదివారం 323 మందిని భారతదేశానికి చేర్చారు.

Indian temporarily suspends E-Visa for Chinese

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News