Monday, April 29, 2024

14,562 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

 

 25 దేశాలకు వైరస్ వ్యాప్తి
 ఢిల్లీకి 323మంది భారతీయులు
 ఫిలిపీన్స్‌లో ఒకరి మృతి
 ఇప్పటి వరకు 305 మరణాలు

బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట ఫిలిప్సీన్స్‌లో ఆదివారంనాడు మొదటి కరోనా మరణం నమోదైంది. శనివారం వరకు కరోనా వల్ల 304 మంది మరణించారని, మృతులందరూ హుబేయి ప్రావిన్స్ వారేనని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సి) ప్రకటించింది. భారతదేశం, అమెరికా, బ్రిటన్, రష్యాతో సహా 25 దేశాలకు విస్తరించిన ఈ అంటువ్యాధి ఇప్పటికి 14,562 మందికి సోకినట్టు అనుమానిస్తున్నామని ఎన్‌హెచ్‌సి తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో మరణించిన వ్యక్తి చైనాకు చెందిన 44 ఏళ్ల పురుషుడు. తాజాగా ఈ వైరస్ మరొకరికి సోకిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) తెలిపింది. ఆ వ్యక్తి చైనాలోని వుహాన్ నుంచి వచ్చారని యుఎఇ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో యుఎఇలో కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య అయిదుకు పెరిగింది. మరోవైపు భారతదేశంలో ఆదివారం రెండో కరోనా కేసు కేరళలో నమోదైంది. ఇటీవల చైనా నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు జరపగా ప్రాణాంతకమైన కరోనా వైరస్ ఉన్నట్టు పాజిటివ్ ఫలితాలొచ్చాయని అధికారులు తెలిపారు. అయితే, పుణెలో నేషనల్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ వైరాలజనీ (ఎన్‌ఐవి) నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ‘మరొక కరోనా పాజిటివ్ కేసుకు అవకాశముందని ఎన్‌ఐవి మాకు ఫోన్ ద్వారా తెలిపింది. అయితే వారి నుంచి రిపోర్ట్ అందాల్సి ఉంది. వ్యాధి వ్యాప్తికి అవకాశముంది కనుక మేము చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని కేరళ తెలిపింది. ‘వ్యాధి సోకిన ట్టు అనుమానమున్న వ్యక్తి వుహాన్ విశ్వవిద్యాలయం విద్యార్థి’ అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె శైలజ కొల్లంలో మీడియాకు చెప్పారు. ‘జనవరి 24న చైనా నుంచి వచ్చిన విద్యార్థి ప్రస్తుతం అలప్పుజా మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఐసొలేషన్ వార్డులో ఉన్నారు. త్రిసూర్‌లో ఒక విద్యార్థికి పాజిటివ్ ఫలితమొచ్చింది.
ఆ దేశాల నుంచి 1,793 మంది
ఇంతవరకూ 1,793 మందిని కరోనా వ్యాధి వ్యాపించిన దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించి, వారిని కేరళలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. వారిలో 70 మందిని కరోనా వ్యాధి నివారణకు ప్రత్యేక ఏర్పాట్లున్న ఆస్పత్రుల్లో చేర్చారు. చైనాలోని వుహాన్ నుంచి 323 మంది భారతీయులు, ఏడుగురు మాల్దీవుల పౌరులతో ఎయిరిండియా రెండో విమానం ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిందని ఎయిరిండియా ప్రతినిధి చెప్పా రు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఆదివారం ఒక ట్వీట్‌లో ఇదే సమాచారం తెలిపారు. శనివారం మొదటి విమానంలో 324 మంది వచ్చారు.

ఒక్క శాంపిల్ చాలు

కరోనా వైరస్ అనుమానితుల కేసుల్లో అది సోకిందో లేదో తెలుసుకునేందుకు తుడిచే వస్త్రం శాంపిల్ ఒకటి చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) తాజాగా తెలిపింది. అంతకు ముందు కరోనా పరీక్షలకు రెండు వస్త్రాలు కావాలని డబ్లూహెచ్‌ఓ చెప్పిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు ఆదివారం చెప్పారు. డబ్లూహెచ్‌ఓ తాజా ఆదేశాల ప్రకారం వ్యాధి సోకినట్టు అనుమానమున్న వ్యక్తి వాడిన శాంపిల్ వస్త్రం చాలు. అందువల్ల త్వరగా పరీక్షలు చేయడానికి వీలవుతుందని ఆ అధికారి అన్నారు. ‘డబ్లూహెచ్‌ఓ నుంచి మాకు తాజా ఆదేశాలు అందాయి. కరోనా వైరస్ పరీక్షకు ఒక తుడిచే వస్త్రం శాంపిల్ చాలని చెప్పారు. ఇంతకు ముందు మేము కరోనా వైరస్ పరీక్షల కోసం రోగి నుంచి రెండు శాంపిల్స్ పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరస్ (ఎన్‌ఐవి) కు పంపేవాళ్లం’ అని మహారాష్ట్ర నిఘా అధికారి డాక్టర్ ప్రదీప్ అవతే చెప్పారు.

World Wide 305 dead with Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News