Saturday, April 27, 2024

కరోనా వైరస్ సోకి భారతీయురాలి పరిస్థితి విషమం.. వైద్యానికి రూ.కోటీ కావాలి..

- Advertisement -
- Advertisement -

 

బీజింగ్: ప్రాణాంతకమైన నోవల్ కరోనా వైరస్ చైనాని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 25 మంది చనిపోగా.. మరో 830 మంది ఈ వైరస్ కు గురైనట్టు ధ్రువీకరించారు. తాజాగా చైనాలోని భారత చెందిన ప్రీతి మహేశ్వరికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె చావుబతుకల మధ్య ఆస్పత్రిలో పోరాడుతోంది. చైనాలో మహేశ్వరి చికిత్సకు 10 లక్షల చైనీస్ యువాన్(భారత కరెన్సీ ప్రకారం రూ.కోటీ)లు ఖర్చు అవుతుందని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో మహేశ్వరీ సోదరుడు మనీష్ థాపా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోరుతూ బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. ఆమె ఆసుపత్రి ఖర్చుల కోసం ఏర్పాట్లు చేయడానికి భారతదేశంలోని హెల్త్‌కేర్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌తో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. కాగా, మహేశ్వరి షెన్‌జెన్‌లోని అంతర్జాతీయ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. అయితే, గత శుక్రవారం తీవ్రంగా అనారోగ్యానికి గురైన ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. కరోనావైరస్ న్యుమోనియా, టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ (మోడ్స్), సెప్టిక్ షాక్‌తో మహేశ్వరి బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రోజు రోజుకూ ఆమె పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌ ద్వారా చికిత్సను అందిస్తున్నారు.

కాగా, వూహాన్‌లోని భారత విద్యార్థులు కరోనా వైరస్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ విస్తరిస్తుండడంతో వూహాన్‌తో సహా ఎనిమిది నగరాల్ని దిగ్బంధం చేసినట్టు చైనా అధికారులు తెలిపారు. ఇక, కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో చైనా నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు దేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వైద్యపరీక్షలు చేస్తున్నారు. Indian woman to have Contracted Coronavirus in China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News