Tuesday, May 14, 2024

రాష్ట్రానికి ప్రైవేటు రైల్ కోచ్ ఫ్యాక్టరీ

- Advertisement -
- Advertisement -

కేంద్రం హామీ నిలబెట్టుకోలేకపోయినా దేశంలోనే అతిపెద్ద కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు రాబోతోంది
మేథా సర్వోడ్రైవ్స్ రూ. 1000 కోట్లతో నెలకొల్పుతున్న ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం : మంత్రి కెటిఆర్ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేకపోయినా, తమకు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు కెటిఆర్ గురువారం ట్వీట్ చేశారు. వరంగల్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏ ర్పాటు చేస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయిం దని, అయినా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడం ద్వా రా రూ.వెయ్యి కోట్లతో మేథా సర్వో డ్రైవ్స్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సె క్టార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతుందని వెల్లడించారు. ఈ ఫ్యా క్టరీ కొన్ని నెలల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉందని పేర్కొంటూ మేథా స ర్వో డ్రైవ్స్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఫొటోలను కెటిఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

India’s largest Private Rail Coach in Telangana: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News