Saturday, April 27, 2024

పుంజుకున్న దేశీయ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Sensex

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. ద్రవ్యోల్బణ భయం ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందినప్పటికీ దేశీయ మార్కెట్లు రాణించడం గమనార్హం. ఐటి, ప్రైవేట్ బ్యాంకులు, ఫార్మా స్టాకులు రాణించాయి. క్రూడాయిల్‌లో ర్యాలీ ఆయిల్ స్టాక్స్‌ను పైకెత్తింది. సెన్సెక్స్ 427.79 పాయింట్లు లేక 0.78 శాతం పెరిగి 55320.28 వద్ద క్లోజయింది. కాగా నిఫ్టీ 121.85 పాయింట్లు లేక 0.74 శాతం పెరిగి 16478.10 వద్ద ముగిసింది. ఆర్‌ఐఎల్, డిఆర్‌ఎల్, ఎయిర్‌టెల్ 3 శాతం మెరకు పెరిగాయి. ఇక నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్‌లో పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఎఫ్‌బి ఇండస్ట్రీస్ లిమిటెడెడ్, మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాభపడగా, ఈపిఎల్ లిమిటెడ్, స్ట్రయిడ్స్ ఫార్మా సైన్స్ లిమిటెడ్, ట్రైడెంట్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్ నష్టపోయాయి. ఇదిలావుండగా డాలరుతో రూపాయి మారకం విలువ 77.76గా నిలిచింది. బంగారం ధర పతనం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News