Monday, May 6, 2024

రెండేళ్లలో 2.2 రెట్లు పెరిగిన ఇన్ఫోసిస్ నియామకాలు

- Advertisement -
- Advertisement -

Infosys increased its hiring of employees by 2.2 times

గత ఏడాది 85 వేల మంది గ్రాడ్యుయేట్ల నియామకం
డివిడెండ్, షేర్ల బైబ్యాక్ ద్వారా రూ.24,100 కోట్లు తిరిగి ఇచ్చాం
ఇన్ఫోసిస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చేర్మన్ నందన్ నీలేకని

బెంగళూరు: ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ గత రెండేళ్లలో తన ఉద్యోగుల నియామకాలను 2.2 రెట్లు పెంచుకుంది. గత ఏడాది కాలంలో సంస్థ ప్రపంచవ్యాప్తంగా 85,000 మంది కాలేజి గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుందని శనివారం ఇక్కడ జరిగిన ఇన్ఫోసిస్ 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ సంస్థ సహవ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం సంస్థ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, నిలకడైన కరెన్సీ ప్రకారం 19.7 శాతం వృద్ధి సాధించామని, గత 11 సంవత్సరాల్లో ఇన్ఫోసిస్ సాధించిన అత్యంత వేగమైన వృద్ధి ఇదేనని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ డిజిటల్ వ్యాపారం 41 శాతం మేర వృద్ధి చెందిందని, మొత్త రెవిన్యూలో దీని వాటా ప్రస్తుతం 59 శాతంగా ఉందని నీలేకని చెప్పారు. ఉత్తర అమెరికా రీజియన్‌నుంచి రాబడి 10 బిలియన్ డాలర్లను దాటిందని, కొత్తగా 94 భారీ డీల్స్ సాధించిందని చెప్పారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగులు 3 లక్షలకు పైగా ఉన్నారు.

కాగా ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం డివిడెండ్, షేర్ల బైబ్యాక్ రూపంలో వాటాదారులకు రూ.24,000 కోట్లు తిరిగి ఇచ్చిందని నీలేకని చెప్పారు. కంపెనీ బోర్డు ప్రతి షేరుకు రూ.16 తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. ఇంతకుముందు ప్రకటించిన రూ.15 మధ్యంతర డివిడెండ్‌తో కలుపుకొని గత ఏడాది ప్రతి షేరుకు రూ.31 డివిడెండ్ చెల్లిస్తోందని, ఇది కాక రూ.11,000 కోట్లకు పైగా షేర్ల బైబ్యాక్ గత ఏడాది సెప్టెంబర్‌లో పూర్తయిందని , ఈ రెండూ కలుపుకొని మొత్తం రూ.24,100 కోట్లు సంస్థ తిరిగి షేర్‌హోల్డర్లకు ఇచ్చిందని ఆయన చెప్పారు. కాగా కంపెనీ సిఇఓ, ఎండిగా సలీల్ పరేఖ్‌ను మరో అయిదేళ్ల కాలానికి తిరిగి నియమించడానికి డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసినట్లు నీలేకని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News