Friday, May 10, 2024

మనిషిలోకి రసాయనాలు ఎక్కిస్తే పోలా?

- Advertisement -
- Advertisement -

TRUMP

 

ట్రంప్ తుంటరి వ్యాఖ్యలు
అనుచిత సలహాలని కొట్టేస్తున్న నిపుణులు

వాషింగ్టన్ : కరోనా వైరస్ అరికట్టేందుకు మనిషి శరీరంలోకి క్రిమిసంహారక మందులు లేదా నిర్థిష్ట నీలలోహిత యువి కాంతిని చొప్పించాలని అమెరికా అధ్యక్షులు ట్రంప్ సూచించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇండ్లల్లో వైరస్, బ్యాక్టీరియా క్రిములను పారదోలేందుకు మందులు వాడుతారు. వీటిని కానీ, సూర్యకాంతిని కానీ శరీరంలోకి ప్రవేశపెడితే కరోనా వైరస్ నివారణ వీలవుతుందని తనకు తెలిసిందని ట్రంప్ చెప్పారు. ఈ దిశలో సరైన ప్రయత్నాలు చేయాలని, వైరస్‌ను చంపివేయాలని ట్రంప్ సూచించారు. అమెరికాలోని శాస్త్ర, సాంకేతిక రంగాల అంతర్గత భద్రతకు సంబంధించిన విభాగం జరిపిన నూతన అధ్యయనాన్ని ట్రంప్ ఆవిష్కరించారు. కరోనా వైరస్ ఇప్పటి చికిత్స విధానంలో చాలా ఆలస్యంగా చనిపోతోంది. ఈ క్రమంలో ఇది విపరీతంగా ఇతరులకు సోకుతోంది. సోకిన వారిని చంపేస్తోందని, దీనికి విరుగుడుగా వెంటనే పనిచేసే చికిత్స అవసరం అని ట్రంప్ తెలిపారు.

ఇప్పటి నూతన ఆవిష్కరణతో యువి కాంతి కిరణాలు కానీ, క్రిమిసంహారక మందులు కానీ శరీరంలోకి చొప్పిస్తే వెంటనే తీవ్రస్థాయి వైరస్ నశిస్తుందని ట్రంప్ చెప్పారు. ట్రంప్‌తో పాటు దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతర్గత భద్రతా విభాగం ఉన్నతాధికారి రోజువారి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. వైరస్‌ను కాంతి పుంజం లేదా క్రిమిసంహారక మందు కేవలం 30 సెకండ్లలో చంపుతుందని ఈ అధికారి వివరించారు. దీనిపై ట్రంప్ ఆశ్చర్యపొయ్యారు. వైరస్ సోకిన మనిషి శరీరంలోకి కాంతి లేదా రసాయనాలు పంపించే వీలుందా? అంత తొందరగా వైరస్ అంతరిస్తుందా? ఇది ఆశ్చర్యకరమే అవుతుందని, అయితే ఈ విధానాన్ని వెంటనే అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని ట్రంప్ సూచించారు. ఈ విధంగా ఒక ఇంజెక్షన్‌తో సత్వర ఫలితం ఉంటే, దాదాపుగా అంతా శుభ్రం అయితే, వైరస్ కట్టడికి వీలేర్పడితే అంతకు మించిన విషయం మరోటి ఉంటుందా? అని ట్రంప్ తెలిపారు. వెంటనే సరైన సూర్యకాంతిని గ్రహించి వైరస్‌ను దెబ్బతీసే ప్రయత్నాలకు దిగాలని కోరారు.

అయితే ట్రంప్ సలహాపై అమెరికా ఆరోగ్య నిపుణులు, ప్రముఖ వైద్యులు వెంటనే స్పందించారు. ఇటువంటి ప్రమాదకర, మరింత గా కొంపలు ముంచే అనుచిత సలహాలు పట్టించుకోవద్దని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి పద్థతికి దిగరాదని స్పష్టం చేశారు. వైరస్‌ను నేరుగా సూర్యకాంతి లేదా ఐసోప్రోపైల్ ఆల్కహాల్ 30 సెకండ్లలో చంపుతుందనే వాదన సరికాదని నిపుణులు తెలిపారు. శరీరాన్ని వైరస్ ప్రభావితం చేస్తోన్న దశలో అంతకంటే వేగవంతంగా తీవ్రస్థాయిలో కుదిపేసే శక్తితో ఉండే సూర్యకాంతిని వాడితే ప్రయోజనం ఉంటుందని తేలితే ఇదే అత్యున్నత విధానం అయి తీరుతుందని ట్రంప్ తెలిపారు. ఇటువంటి సూచనలతో ప్రజలు మరింతగా చనిపోతారని , ఇష్టం వచ్చినట్లుగా ప్రయోగాలకు దిగితే వైరస్ కన్నా ఇదే తీవ్రతరం అవుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఇది కేవలం సలహానే అనుకుంటే ఫర్వాలేదు కానీ ప్రమాదకరం అని అత్యవసర వైద్య గ్లోబల్ హెల్త్ విభాగం డైరెక్టర్ క్రెయిగ్ స్పెన్సర్ స్పష్టం చేశారు.

Inject disinfectants kill coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News