Sunday, April 28, 2024

డిసెంబర్ 31 దాకా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు

- Advertisement -
- Advertisement -
International Flights To Remain Suspended Till Dec 31
డిసెంబర్ 31 దాకా.. డిజిసిఎ ప్రకటన

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసుల రద్దును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు విమానయాన భద్రతా సంస్థ డిజిసిఎ ప్రకటించింది. అయితే ఈ ఆంక్షలు సరకు రవాణా విమానాలకు, డిజిసిఎ ప్రత్యేకంగా ఆమోదం తెలిపిన విమాన సర్వీసులకు వర్తించదని డిజిసిఎ గురువారం ఒక అధికార ప్రకటనలో తెలియజేసింది. గత జూన్ 26వ తేదీన జారీ చేసిన సర్కులర్‌ను పాక్షికంగా సవరించడం ద్వారా దీనికి సంబంధించి భారత్‌నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసుల నిలిపివేతను 2020 డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించడమైంది’ అని డిజిసిఎ ఆ సర్కులర్‌లో తెలిపింది. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించనున్నట్లు కూడా ఆ సర్కులర్ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌నుంచి బయలుదేరే, వచ్చే అన్ని అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను గత మార్చి 23నుంచి నిలిపి వేసిన విషయం తెలిసిందే. అయితే విదేశీ మార్గాల్లో రెగ్యులర్ విమాన సర్వీసులు లేనందున గత మూనుంచా వందేభారత్ మిషన్‌లో భాగంగా , అలాగే కొన్ని దేశాలతో చేసుకున్న ద్వైపాక్షిక ‘ఎయిర్ బబుల్’ ఒప్పందాల కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News