Sunday, May 5, 2024

ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తోంది: సిజెఐ

- Advertisement -
- Advertisement -

CJI Ramana Attend To India - Singapore Mediation Summit

హైదరాబాద్: పెట్టుబుడులు పెట్టేవారు లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని సిజెఐ ఎన్‌వి రమణ తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు, న్యాయమూర్తులు, మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, సిఎస్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిజెఐ ఎన్ వి రమణ ప్రసంగించారు. లిటిగేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తోందని, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపిందని కొనియాడారు. మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహకారం అందిస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారని సిజెఐ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News