Wednesday, May 1, 2024

సన్‌రైజర్స్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

సన్‌రైజర్స్‌కు సవాల్
నేడు ముంబైతో కీలక పోరు

IPL 2021: MI vs SRH Match Tomorrow

చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ సవాలుగా మారింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన సన్‌రైజర్స్ కనీసం ఈసారైన విజయం సాధించాలని భావిస్తోంది. ఇక హైదరాబాద్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్న బ్యాటింగ్ వైఫల్యంతో వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇక కిందటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఆత్మవిశ్వాసంతో ఈపోరుకు సిద్ధమైంది. కోల్‌కతా మ్యాచ్‌లో ఓటమి అంచుల వరకు వెళ్లి అనూహ్య విజయాన్ని అందుకున్న ముంబై సమరోత్సోహంతో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధించాలని భావిస్తోంది.
బ్యాటింగే సమస్య..
ఇక సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. రెండు మ్యాచుల్లోనూ బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. కిందటి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, మనీష్ పాండేలు మాత్రమే రాణించారు. మిగతావారు విఫలం కావడంతో బెంగళూరు విధించిన స్వల్ప లక్ష్యాన్ని సయితం హైదరాబాద్ ఛేదించలేక పోయింది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచిన వృద్ధిమాన్ సాహాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తారా లేదా అనేది సందేహంగా మారింది. ఇక మనీష్ పాండే బాగానే ఆడుతున్నా అతని బ్యాటింగ్‌లో వేగం కనిపించడం లేదు. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. కిందటి మ్యాచ్‌లో వార్నర్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడడం హైదరాబాద్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు స్టార్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టో ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక హోల్డర్, శంకర్, సమద్, రషీద్ తదితరులు కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలి. ఇక బౌలింగ్‌లో హైదరాబాద్‌కు పెద్దగా ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. కిందటి మ్యాచ్‌లో హోల్డర్, రషీద్‌లు అద్భుతంగా రాణించారు. భువనేశ్వర్, నటరాజన్ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఒక బ్యాటింగ్ మెరుగుపరుచుకుంటే హైదరాబాద్‌కు ఎదురే ఉండదు.
జోరుమీదుంది..
మరోవైపు కిందటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌కు సమరోత్సోహంతో సిద్ధమైంది. కోల్‌కతాపై బౌలర్లు అద్భుతంగా రాణించారు. రాహుల్ చాహర్ తన స్పిన్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌల్ట్ రెండు మ్యాచుల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక బుమ్రా రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్ ఉండనే ఉన్నాడు. కృనాల్, హార్దిక్‌లు కూడా జోరుమీదున్నారు. పొలార్డ్ కూడా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక రోహిత్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పొలార్డ్, పాండ్య సోదరులతో ముంబై బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IPL 2021: MI vs SRH Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News