Monday, April 29, 2024

‘దివ్య’మైన సాయం

- Advertisement -
- Advertisement -

కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కెటిఆర్
వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు
అర్హులైన వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి

KTR distributes Equipment to Divyang in LB Stadium

మనతెలంగాణ/హైదరాబాద్: సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధను అర్థం చేసుకుని వారి కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. ఈ మాట సిఎం కెసిఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని పేర్కొన్నారు. పేదరికంలో ఉండే పేదలు కానీ, ఇతర శారీరకమైన ఇబ్బందులు ఉండే దివ్యాంగులకు బాసటగా, ఆసరాగా నిలబడాలన్నదే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కెటిఆర్ ఉద్ఘాటించారు.వికలాంగుల ముఖాల్లో చిరునవ్వును చూసిప్పుడే తమకు సంతోషంగా ఉంటుందని అన్నారు. శుక్రవారం ఎల్‌బి స్టేడియంలో అర్హులైన వికలాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్ కె.వాసుదేవరెడ్డి, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ,వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా.. రూ. 24 కోట్ల 38 లక్షలతో 16,600 మంది వికలాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణీ చేయడం సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. నాలుగైదు నెలల కిందట వికలాంగుల సమస్యల పట్ల సమావేశం నిర్వహించి కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని చాలెంజ్ చేయడం జరిగిందని, అందులోని ఆవిష్కరణలను కొన్నింటిని ఇవాళ వికలాంగులకు అందిస్తున్నామని తెలిపారు.

వికలాంగులకు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నామని, నైపుణ్యా శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గతంలో వికలాంగులకు రూ.500 పెన్షన్లు ఇస్తే, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3,016 పెన్షన్ ఇస్తుందని పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లల్లో కూడా 5 శాతం ఇండ్లను వికలాంగులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నిబంధన అన్ని జిల్లాల్లో అమలయ్యే విధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లను వికలాంగుల కోసం అమలు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద వికలాంగుల వివాహాలకు రూ. 1,25,145 చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. వికలాంగుల సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.
వికలాంగులకు పంపిణీ చేసిన పరికరాలు: త్రిచక్ర (రిట్రోపిట్డెడ్) మోటార్ బైక్‌లు 900, బ్యాటరీ వీల్‌చైర్స్ 650, ల్యాప్‌టాప్‌లు 300, 4జీ స్మార్ట్‌ఫోన్‌లు 400, డైసీ ప్లేయర్స్ 120, త్రిచక్ర వాహనాలు 1,500, వీల్ చైర్స్ 2,000, చంక కర్రలు 3,000, వినికిడి యంత్రాలు 1,460, అంధుల చేతికర్రలు 2,065, ఎంపీ-3 ప్లేయర్స్ 800, బ్రెయిలీ బుక్స్ 478, ఇన్నొవేటివ్ స్మార్ట్ కేన్స్ 165, ఇన్నొవేటివ్ వీల్స్‌చైర్స్ ఫర్ క్రికెటర్స్ 13, ఇన్నొవేటివ్ క్రచెర్స్ 155, ఆర్టిఫిషియల్ లింబ్స్ 334, క్యాలీపెర్స్ 260, బ్యాటరీ ట్రై సైకిళ్లు 2,000.

KTR distributes Equipment to Divyang in LB Stadium

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News