Saturday, April 27, 2024

హమాస్ దాడులకు ఇరానే విలన్: ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : తమ భూభాగంపై హమాస్ దాడులవెనుక కీలక పాత్రధారి ఇరాన్ అని, దీనిని తాము నిస్పందేహంగా చెప్పగలమని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. పలు కారణాలతో ప్రత్యేకించి ఇజ్రాయెల్‌తో నెలకొని ఉన్న ఆధిపత్య పోరుతో ఇరాన్ చాలా కాలంగా హమాస్‌కు సాయం అందిస్తోంది. చివరికి ఈ సంస్థ కార్యకలాపాలలో భాగస్వామ్యపక్షం అయిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు అదునుచూసుకుని హమాస్‌ను ఇరాన్‌ను ప్రేరేపించింది ఇరాన్ అని విమర్శించారు. ఇటీవలే ఇరాన్ సుప్రీం నేత అయాతొల్లా అలీ ఖమేనీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇజ్రాయెల్‌ను ఉద్ధేశించి పరోక్షంగా పలు తీవ్రస్థాయి వ్యాఖ్యలకు దిగారు.

ఓ దురహకారం ఆధిపత్య దేశం కుప్పకూలనుందని, ఇప్పుడు పాలస్తీనియా యువత, అక్కడి అణచివేతల ప్రతిఘటనోద్యమ శక్తులు ఇప్పుడు అత్యంత శక్తివంతం అయినట్లు తెలిపారు. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో వీరు విరుచుకుపడుతారు. ఈ ఉద్యమం ఈ ఆకాంక్షల పోరు లక్షాలు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇరాన్ అధినేత ఖమేనీ కనుసన్నల్లోనే ఉగ్రవాద సంస్థలు హమాస్ , పాలస్తీనియా ఇస్లామిక్ జిహాదీలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎల్ కెహెన్ ఫాక్స్ న్యూస్ డిజిటల్‌కు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News