Friday, May 3, 2024

శాస్త్రవేత్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం

- Advertisement -
- Advertisement -

Iranian leaders say they will retaliate for Scientist Assassination

 

ఇరాన్ నేతల హెచ్చరిక

టెహ్రాన్ : టెహ్రాన్‌కు చెందిన ప్రముఖ అణుశాస్త్రవేత్త మొసిన్ హూ హత్యవెనుక ఉన్నవారిని కచ్చితంగా శిక్షించి తీరుతామని ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధినేతలు శనివారం వెల్లడించారు. ఇరాన్ అధినేత ఆయతొల్లా అలి ఖమైనీ, అధ్యక్షుడు హసన్ రౌహానీ శనివారం వేర్వేరు ప్రకటనల్లో ఈమేరకుహెచ్చరించారు. ఈ హత్యకు టెహ్రాన్ సైనిక అణుకార్యక్రమం రద్దు చేయడానికి జరుగుతున్న కుట్రకు సంబంధం ఉందని ఖమైనీ అనుమానం వెలిబుచ్చారు. ఇది సైనిక దాడి పద్ధతిలో ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం పూర్తయిన తరుణంలో తిరిగి టెహ్రాన్‌తో ట్రంప్ రద్దు చేసిన అణుఒప్పందం కుదుర్చుకోడానికి నూతన అధ్యక్షుడైన బైడెన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ హత్యారాజకీయాలు అమెరికా, టెహ్రాన్ మధ్య తాజాగా ఉద్రిక్తతలు నెలకొనేలా చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది.

శనివారం ఉదయం పెంటగాన్ తాము నిమిట్జ్ విమానాన్ని మధ్యప్రాచ్యానికి తిరిగి వెనక్కు రప్పించినట్టు ప్రకటించింది. ఫక్రజాదే ఇరాన్ ప్రముఖ, విశిష్ట, రక్షణ శాస్త్రవేత్త అని ఆయన హత్యకు ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో ఆ నేరస్తులపై ప్రతీకారం తీర్చుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని ఖమైనీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. అంతకు ముందు శనివారం ఉదయం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ తమ ప్రభుత్వ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో మాట్లాడుతూ ఈహత్యకు ఇజ్రాయెలే బాధ్యురాలుగా ఆరోపించారు. ఫక్రజాదే మరణంతో తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపలేరని ఈ హత్యకు సరైన సమయంలో స్పందించి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News