Sunday, May 12, 2024

సైబర్ క్రైమ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Its time to party movie

 

బుల్లితెర రాములమ్మ, ప్రముఖ యాంకర్ ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయ అవుతున్న ఈ చిత్రంలో ప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్‌టైల్ సినిమాస్ పతాకాలపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ “ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది ఈ చిత్రం. ఈ సినిమాలో శ్రీముఖి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. కానీ ఆమెది చాలా ముఖ్యమైన క్యారెక్టర్. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులు, ప్రేక్షకులను ఈ క్యారెక్టర్ ఆశ్చర్యపరుస్తుంది. ఈ పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News