Friday, April 26, 2024

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఉండదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లడుతూ.. ”దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ, రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ కట్ అవదు. తెలంగాణలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. తెలంగాణలో విద్యత్ సంక్షోభంపై అవాస్తవాలు ప్రచారమవుతున్నాయి. శ్రీశైలం, సాగర్ రామగుండం, కొత్తగూడెం, భూపాలపల్లిలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు సరిపోతుంది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కేంద్ర నిర్ణయాలతో విద్యుత్ ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఇష్ట రీతిన తీసుకునే నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ సంస్థలను ధారాదత్తం చేసేందుకే ఈ బోగ్గు కృత్రిమ కొరత అని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తుంది.కేంద్రం తీసుకున్న నిర్ణయంతోనే ఇవాళ దేశంలో విద్యుత్ కోతలు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కలరాయవద్దు.సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఎక్కడ కూడా కోతలు లేవు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.మళ్ళీ హైదరాబాద్ నుండి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్ వలయం ఏర్పాటు చేశాం” అని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Jagadish Reddy about power generation in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News