Wednesday, May 1, 2024

దావోస్ పర్యటనలో ఎపికి చక్కటి ఫలితాలు

- Advertisement -
- Advertisement -

అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్- డబ్ల్యూఇఎఫ్‌తో ఒప్పందం

Jagan tour in Davos

మనతెలంగాణ/హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని – పర్యారణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు దావోస్ వేదికగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం చక్కటి ఫలితాలను సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దావోస్ వేదికను రాష్ట్రం వినియోగించుకుంది. విఖ్యాత కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంతో ఎంవొయూలు కుదుర్చుకున్నారు. నాలుగోతరం పారిశ్రామికీకరణకు మూలకేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీకి సంబంధించే రూ.1.25కోట్ల పెట్టబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదర్చుకుంది.

గ్రీన్‌కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై ఎపిలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్టు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ప్రకటించింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలోనే సంస్థ సిఇవొ ఆదిత్య మిట్టల్ ఈ ప్రకటన చేశారు. ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఎపి కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సివివొ కితాబిచ్చారు.గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్‌ఇజెడ్‌ను తీసుకురానుండడం దావోస్ ఫలితాల్లో ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రై వేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్దతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈజోన్‌ను అభివృద్ధిచేస్తారు.

రాష్ట్రంలోనే అతిపెద్దనగరం, ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికచేసుకున్న విశాఖపట్నంకు దావోస్ వేదికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి కృషిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హై ఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపైనా చర్చించారు. దావోస్ వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో రాష్ట్రం తన ప్రగతిని వినిపించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ పై పబ్లిక్ సెషన్‌లో పాల్గొన్న సిఎం- కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి విప్లవాత్మకంగా చేపడుతున్న మార్పులను వివరించారు. కోవిడ్ లాంటి విపత్తను ఎవ్వరు కూడా ఊహించలేదని, వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని, అందరి స్తోమతకూ తగినట్టుగా ఉండాలని సిఎం దావోస్ వేదికగా పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News