Friday, April 26, 2024

దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా జమ్మికుంట

- Advertisement -
- Advertisement -

Jammikunta police station as best in the country

హైదరాబాద్‌ః దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్‌స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలందించడం, పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీ తత్వాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా పది అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఎంపిక చేస్తుందన్నారు. ఈ 2020 సంవత్సరానికి గాను ఎంపిక చేసిన పది ఉత్తమ పోలీస్ స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆనందదాయకమన్నారు. ఈక్రమంలో వరుసగా రెండవసారి కరీం నగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలవడం పట్ల డిజిపి, కరీంనగర్ కమీషనర్ కమల హాసన్ రెడ్డి, జమ్మికుంట స్టేషన్ హౌస్ అధికారితో పాటు ఈ ఘనతను సాధించిన ఇతర పోలీస్ అధికారులను అభినందించారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు దక్కిన ఈ పురస్కారం స్ఫూర్తిగా రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఉత్తమ పౌర సేవలు, ఫ్రండ్లీ పోలీసింగ్ అమలుకు ఆదర్శంగా తీసుకోవాలని డిజిపి పిలుపు నిచ్చారు. 2019 సంవత్సరం లో చొప్పదండి పోలీస్ స్టేషన్ 8 వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచిందని గుర్తుచేశారు.

మేయర్, డిప్యూటీ మేయర్ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1) కొట్టివేయాలని పిటిషన్‌లో అనిల్ కుమార్ కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎస్‌ఈసీ, జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News