Wednesday, May 1, 2024

అవుట్ అండ్ అవుట్ ఫన్

- Advertisement -
- Advertisement -

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా పరిచయమవుతూ రూపొందించారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అనుదీప్.కె.వి. దర్శకత్వంలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనుదీప్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

చాలా హ్యాపీగా…
నేను పదేళ్ల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది చూసి నాగ్‌అశ్విన్ కలిశారు. అప్పుడే ‘పిట్ట గోడ’ లైన్ చెప్పడం జరిగింది. అది నచ్చడంతో డెవలప్ చేసి సినిమా చేశాం. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు ఈ సినిమా అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది.
అద్భుతంగా నటించారు…
ముగ్గురు అమాయకుల కథే ఈ చిత్రం. ముందుగా నవీన్‌ను నాగ్‌అశ్విన్ తీసుకున్నారు. అయితే ఇతర రెండు పాత్రలకు చాలా మందినే అనుకున్నాం. కానీ చివరకు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలను తీసుకున్నాం. వీరు ముగ్గురు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.
ముగ్గురం కలిసి…
ఈ సినిమా కథను నేను, నాగ్ అశ్విన్… అలాగే సమీర్ అనే ఇంకొకతను కలిసి డెవలప్ చేశాం. నేను అయితే అవుట్ అండ్ అవుట్ ఫన్‌గా ఈ సినిమా తీద్దామని అనుకున్నాను. ఇక అక్కడ నుంచి ముగ్గురం కలిసి ఈ సినిమాను పూర్తిచేశాం.
కొత్త మ్యూజిక్…
మ్యూజిక్ డైరెక్టర్ రాధన్‌ను నాగ్ అశ్విన్ తీసుకున్నారు. స్క్రిప్ట్ విన్నాక అతను కొత్త మ్యూజిక్ ఇవ్వడానికి నాకు కూడా చాలా బాగుంటుందని చెప్పాడు. రాధన్ మంచి ఆర్‌ఆర్ కూడా ఇచ్చాడు.
హారర్, వయోలెన్స్ తప్ప…
దర్శకుడిగా నేను అన్ని జోనర్ సినిమాలు తీయాలని అనుకుంటున్నాను. హారర్, వయోలెన్స్ సినిమాలు తప్ప మిగతావి చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్ కామెడీ స్క్రిప్ట్ రాస్తున్నాను. నాగ్‌అశ్విన్‌తో చర్చించి ఇది ఫైనల్ చేస్తా. అది కూడా ఇదే బ్యానర్ లో ఉంటుంది.

Jathi Ratnalu Movie Director Anudeep interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News