Saturday, May 4, 2024

‘బంగార్రాజు’లో సీనియర్ హీరోయిన్

- Advertisement -
- Advertisement -

Jaya prada act with nagarjuna

 

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోందట. సీనియర్ హీరోయిన్ జయప్రద కోసం ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారని, ఆమె క్యారెక్టర్ సినిమాలో కీలకమని తెలిసింది. ఇక జూలై నుండి షూటింగ్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే మొదట నాగ్, చైతు కలయికలో ఈ సినిమా రానుందని అన్నారు.

కానీ చైతు ఈ సినిమాలో జస్ట్ గెస్ట్ రోల్‌లో మాత్రమే కనిపిస్తాడట. చైతు కొడుకు పాత్రలో అక్కినేని అఖిల్ కనిపిస్తాడని, అంటే ఈ సినిమా మొత్తం ‘బంగార్రాజు’, అతని మనవడు అఖిల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. అంటే నాగ్ -, అఖిల్… తాత మనవళ్లుగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ.. సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యమైనా సినిమా ఆసక్తికరంగాఉంటుందట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News