Friday, May 3, 2024

23న జెఇఇ మెయిన్-4 హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

JEE Main-4 Hall Tickets on Aug 23rd

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా రెండవ దశ విజృంభన నేపథ్యంలో వాయిదా పడిన జెఇఇ మెయిన్ నాలుగవ విడత హాల్ టికెట్లు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి. నాలుగవ జెఇఇ మెయిన్ పరీక్షలు ఈ నెల 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో జరుగనున్నాయి. పరీక్షలకు మూడు రోజుల ముందు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది.

కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి నాలుగు సెషన్లుగా జెఇఇ మెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి సెషన్లలో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించగా, జూలైలో మూడవ విడత నిర్వహించారు. మూడవ జెఇఇ మెయిన్‌ను విజయవంతంగా నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేశారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలు పాటించవలసి ఉన్న నేపథ్యంలో జెఇఇ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను, పరీక్షా కేంద్రాలను పెంచారు.

నీట్ పరీక్షా కేంద్రాల పెంపు

దేశంలో వైద్యవైద్యలో ప్రవేశాలకు సెప్టెంబర్ 12న నిర్వహించనున్న నీట్(యుజి) 2021 పరీక్షా కేంద్రాలు ఈ సారి గణనీయంగా పెరిగాయి. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో భౌతికదూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచగా, గత ఏడాది 3,862గా ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచుతున్నట్లు ఎన్‌టిఎ ప్రకటించింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్కులు అందజేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈసారి ఇంగ్లీష్, హిందీ భాషలతోపాటు 11 భాషల్లో పెన్ అండ్ పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు మూడు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 9వ తేదీన నీట్ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News