Thursday, May 9, 2024

మందుబాబులపై నగర పోలీసుల ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

drunk and drive Cases against 2056 people

1,670మందిపై కేసులు
రూ. 1,74,50,100 జరిమానా విధింపు

హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులపై నగర పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. జులై నెలలో నగర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలను నడుపుతున్న 2,056 మంది డ్రైవర్లను పట్టుకున్నారు. ఇందులో 1,670మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి రూ.1,74,50,100 జరిమానా విధించారు. ఇందులో ముగ్గురు డ్రైవర్ల లైసెన్స్‌లు రుద్దు చేశారు. అందులో 386మందిని కోర్టులో హాజరపర్చారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసి పట్టుబడితే వీసా, ప్రభుత్వ ఉద్యోగం, పాస్‌పోర్టు రదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డుప్రమాదాల బారినపడితే ఇన్సూరెన్సు కూడా రాదని చెప్పారు. ట్రిపుల్ రైడింగ్ వాహనాలపై వెళ్తే ఇన్సూరెన్స్ రాదని పేర్కొన్నారు.

drunk and drive Cases against 2056 people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News